DSP Vijay Sethupathi: ‘డీఎస్పీ’గా విజయ్ సేతుపతి
ABN, First Publish Date - 2022-11-14T16:45:05+05:30
టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)..
టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ (Kollywood) నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). కోలీవుడ్‌లో ఆయన్ని ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి అని అభిమానులు పిలుచుకుంటూ ఉటారు. అయితే.. అప్పుడప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ నటుడు.. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోనూ స్టార్‌గా మారిపోయాడు. ఆ క్రేజ్‌తో తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు.
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించే 46వ చిత్రం టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ నటుడు 2010లో విడుదలైన ‘తెన్‌మేర్కు పరువకాట్రు’లో హీరోగా వెండితెరకు పరిచమయ్యాడు. అనంతరం ‘పిజ్జా’, ‘సూదుకవ్వం’, ‘నానుం రౌడీదాన్’, ‘ధర్మదురై’, ‘విక్రమ్ వేద’, ‘96’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో 46వ చిత్రానికి ‘డీఎస్పీ’ (DSP)గా టైటిల్‌ను ఖరారు చేయగా.. ఆ చిత్రానికి పొన్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి చాలాకాలం తర్వాత పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి బైకుపై వస్తున్న పోస్టరు విడుదల చేశారు. కాగా.. విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.