పీకేను కలిసిన విజయ్‌!

ABN , First Publish Date - 2022-03-17T22:19:03+05:30 IST

తమిళ హీరో విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే నిజమనే కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. రాజకీయాల్లోకి రావాలని విజయ్‌కు కొంతకాలంగా కోరిక ఉంది. ఆయన తండ్రి చంద్రశేఖర్‌ ఆలోచన కూడా అదే.

పీకేను కలిసిన విజయ్‌!

తమిళ హీరో విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే నిజమనే కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. రాజకీయాల్లోకి రావాలని విజయ్‌కు కొంతకాలంగా కోరిక ఉంది. ఆయన తండ్రి చంద్రశేఖర్‌ ఆలోచన కూడా అదే. ఈ క్రమంలోనే ‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో పార్టీని స్థాపించారు. విజయ్‌ ఒత్తిడితో ఆ పార్టీని ఉప సంహరించుకున్నారు. మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. రానున్న లోక్‌సభ ఎన్నికల సమయానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ నిర్వాహకులు కొంత కాలంగా విజయ్‌పై ఒత్తిడి పెంచుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ ఈ దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన సాధ్యాసాధ్యాలు భేరీజు వేసుకునే పనుల్లో విజయ్‌ ఉన్నారని తెలుస్తోంది. దాని కోసమే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ని గతంలో ఓసారి కలిశారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం గురువారం హైదరాబాద్‌లో విజయ్‌ ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ అయ్యారని తెలిసింది. రానున్న ఎన్నికలను టార్గెట్‌ చేసుకొని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో విజయ్‌ ఉన్నారని సమాచారం. అయితే ఈ భేటీలో రానున్న ఎన్నికల  గురించి నిర్ణయం తీసుకోబోతున్నారా? లేక తమిళనాడు భవిష్యత్తు రాజకీయాల గురించి ఆరా తీశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2022-03-17T22:19:03+05:30 IST

Read more