Liger Twitter Review: విజయ్, పూరీ కాంబో మూవీ ఎలా ఉందంటే..
ABN, First Publish Date - 2022-08-25T14:33:16+05:30
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన.. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇంతకుముందే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ని అందుకుని.. ఆ హైప్‌ని భారీగా పెంచేసింది.
దానికితోడు మొదటి సినిమా కూడా విడుదల అవ్వకముందే నార్త్‌లోని వివిధ నగరాల్లో విజయ్‌కి దక్కిన ఆదరణ.. అదే స్థాయిలో ప్రమోషన్స్‌కు కూడా చేయడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అన్ని అంచనాల నడుమ ఆ సినిమా ఈరోజు (ఆగస్టు 25) విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ ప్రిమీయర్ షోస్ ఇప్పటికే పడిపోయాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఈ సినిమా గురించి విశేషాలు పంచుకుంటున్నారు. అందులో కొందరూ సూపర్ అంటుండగా.. కొందరూ మాత్రం బాలేదని పెదవి విరుస్తున్నారు. కాగా.. ట్విట్టర్లో నెటిజన్లు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం..