పూరి జగన్నాథ్– విజయ్ రెండో సినిమా!
ABN , First Publish Date - 2022-03-28T20:20:31+05:30 IST
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఛార్మి ట్వ్టిట్టర్ వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల చేసిన పోస్టర్‌లో ఉంది.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఛార్మి ట్వ్టిట్టర్ వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల చేసిన పోస్టర్‌లో ఉంది. అంటే మంగళవారం ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేయనున్నారని అర్ధమవుతోంది.
అయితే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకొంటున్న ‘జనగణమన’ ఇదేనా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అసలు విషయం తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే! పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ చిత్రంలో అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.