Vijay Devarakonda: ‘లైగర్‌’ ఫ్లాప్‌ అయితే.. విజయ్‌ ఏం చెప్పాడు?

ABN , First Publish Date - 2022-08-23T23:35:35+05:30 IST

లైగర్‌ టీమ్‌ దేశవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి పూర్తిటీమ్‌ దేశమంతా చుట్టేసింది. ఫలితంగా సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ ప్రచారంలో భాగంగా హీరో విజయ్‌కు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘లైగర్‌ ఫ్లాప్‌ అయితే మీ స్పందన ఏంటి’ అని ఓ అడియన్‌ అడగ్గా, ‘అలాంటి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవలసిన పనిలేదు.

Vijay Devarakonda: ‘లైగర్‌’ ఫ్లాప్‌ అయితే.. విజయ్‌ ఏం చెప్పాడు?

లైగర్‌ (Liger)టీమ్‌ దేశవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి పూర్తి టీమ్‌ దేశమంతా చుట్టేసింది. ఫలితంగా సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ ప్రచారంలో భాగంగా హీరో విజయ్‌కు (Vijay devarakonda) ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘లైగర్‌ ఫ్లాప్‌ అయితే మీ స్పందన ఏంటి’ అని ఓ ప్రేక్షకుడు అడగ్గా, ‘అలాంటి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవలసిన పనిలేదు. నేను కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఇదే ప్రశ్న అడిగి ఉంటే కోపంతో విరుచుకుపడేవాడిని. దానికి తగ్గ సమాధానం ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు కోపం ఎక్కువ. కానీ కొద్దిరోజులుగా సినీ ప్రేమికులు నాపై చూపిస్తున్న ప్రేమ నాలో మార్పు తీసుకొచ్చింది. ఆ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఆడియన్స్‌ చాలా ముఖ్యం. వాళ్ల కోసమే సినిమాలు చేస్తున్నా. ఈ ప్రచార కార్యక్రమాల వల్ల ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నా’’ అంటూ విజయ్‌ చెప్పారు. పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ‘లైగర్‌’ చిత్రం ఈ నెల 25న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌టైసన్‌ ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. 


Updated Date - 2022-08-23T23:35:35+05:30 IST