Vijay Devarakonda: నాకున్న టెన్షన్ అదొక్కటే
ABN , First Publish Date - 2022-08-14T22:16:36+05:30 IST
తన రిలేషన్షిప్ గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘లైగర్’ చిత్రం ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చుట్టేస్తున్న ఆయన ఎవరితో రిలేషన్లో ఉన్నది చెప్పి ఆమె ప్రైవసీకి భంగం కలిగించడం ఇష్టం లేదని చెప్పారు. ‘‘నా వ్యక్తిగత విషయాల గురించి అందరితో పంచుకోవడం నాకు నచ్చదు.
తన రిలేషన్షిప్ గురించి విజయ్ దేవరకొండ (Vijay devarakonda)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘లైగర్’ (Liger)చిత్రం ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చుట్టేస్తున్న ఆయన ఎవరితో రిలేషన్లో ఉన్నది చెప్పి ఆమె ప్రైవసీకి భంగం కలిగించడం ఇష్టం లేదని చెప్పారు. ‘‘నా వ్యక్తిగత విషయాల గురించి అందరితో పంచుకోవడం నాకు నచ్చదు. హీరోగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటానికి నేను ఇష్టపడినా.. బయట ఫోకస్ కావడం నేను రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయకి ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే నాకు నచ్చని పనుల జోలికి వెళ్లను అని చెప్పారు విజయ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఖుషి’, ‘జనగణమన’ చిత్రాలున్నాయి.
అప్పుడే సైన్ చేయను
బాలీవుడ్ అవకాశాలు వచ్చినప్పటికీ దేనికీ ఓకే చెప్పలేదు. నేను ఎగ్జైట్ అయ్యే కథలేమీ రాలేదు. ‘లైగర్’ (Liger)విడుదలై ఆ సక్సెస్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా. అప్పటి వరకూ ఏ సినిమాకు సైన్ చేయను. సినిమా కోసం చాలా కష్టపడ్డా. ఫిట్నెస్ పరంగా చాలా జాగ్త్రత్తలు తీసుకున్నా. ముఖ్యంగా మద్యాన్ని వదిలేశా. ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నా. సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. కాకపోతే హైదరాబాదీ అయిన నేను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరికీ చేరువకాగలనా? అనే భయం ఉంది. ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక్క టెన్షన్ అదే!
లోకేశ్ ప్రపంచానికి వెళ్తా...
అర్జున్‌రెడ్డి సినిమాలో నా నటన కరణ్ జోహార్‌కి ఎంతో నచ్చింది. ఆయన్ను కలిసిన సందర్భంలో నాతో సినిమా చేస్తానని చెప్పారు. ‘లైగర్’ కథ విని నిర్మాతగా ఉండేందుకు అంగీకరించారు. సరైన వ్యక్తి సినిమాపైనే పెట్టుబడి పెట్టానని ఆనందించేలా చేస్తానని ఆయనకు మాటిచ్చా. అది పూర్తి స్థాయిలో చేశాననే అనుకుంటున్నా. ఈ మధ్యనే లోకేశ్ కనగరాజ్ తీసిన ‘విక్రమ్’ చూశా. ఆయన సినిమాటిక్ వరల్డ్ లోకి నేనూ వెళ్లాలనుకుంటున్నా. త్వరలోనే ఆయన్నుంచి ఫోన్ వస్తుందని భావిస్తున్నా.