సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vidya Vasula Aham: వివాహంతో ముడిపడిన లాంగ్ లాంగ్ ఇగో స్టోరీ

ABN, First Publish Date - 2022-09-01T06:31:17+05:30

రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) హీరోహీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కబోతున్న సినిమా ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham). షూటింగ్ దశలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) హీరోహీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కబోతున్న సినిమా ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham). షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో.. వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ మరియు లుక్ ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా.. యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందనేది ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ వీడియోకు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుండటంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇగో హిస్టరీని చాలా క్లారిటీగా చెప్పారు. అందరూ ‘లాంగ్ లాంగ్ ఎగో’ అంటారు.. కానీ ఈ కాన్సెప్ట్ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా టైటిల్ కింద ‘ఎ లాంగ్ లాంగ్ ఇగో స్టోరీ’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. రామాయణం, మహాభారతం, ట్రోజన్ వార్, బాహుబలి యుద్దం.. ఇవన్నీ ఇగో కారణంగానే జరిగాయని తెలుపుతూ వచ్చిన ఈ కాన్సెప్ట్ వీడియో.. సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.


ఈ సినిమాని ‘తెల్లవారితే గురువారం’ సినిమా ఫేమ్ మణికాంత్ గెల్లి (Manikanth Gelli) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక ఇంటి సెట్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేయడం జరిగింది. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగోలతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ (Kalyani Malik) ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘విద్య వాసుల అహం’ త్వరలోనే థియేటర్స్‌లో విడుదల కానుంది. 



Updated Date - 2022-09-01T06:31:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!