RRR : ఇంట్రవెల్ బ్యాంగ్ సీక్రెట్ ఇదే !

ABN , First Publish Date - 2022-07-13T18:26:32+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా తొలిసారిగా కలిసి నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన దక్కించుకొని బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

RRR : ఇంట్రవెల్ బ్యాంగ్ సీక్రెట్ ఇదే !

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా తొలిసారిగా కలిసి నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన దక్కించుకొని బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బలమైన ఎమోషన్స్‌తో, కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది ఈ సినిమా. తన సినిమాల్లో సీజీ వర్క్ ఎంతో ప్రత్యేకంగానూ, పెర్ఫెక్ట్‌గానూ ఉండాలనే తపించే జక్కన్న.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కూడా వాటిని సినిమాకే  హైలైట్స్‌గా తీర్చిదిద్దారు. ఈ విషయంలో వీఎఫ్ఎక్స్ టీమ్ పడ్డ కష్టానికి, వారి పెర్ఫెక్షన్‌కు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ముఖ్యంగా చరణ్, తారక్ ఇంట్రడక్షన్ సీన్స్, పులితో తారక్ ఫైట్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటికే వీటిలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ ఎలా జరిగిందో చెబుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. 


ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంట్రవెల్ సీన్‌‌లో తారక్, చరణ్ జంతువులతో పులితో పోరాడే గ్రాఫికల్ సీక్రెట్‌ను బైట పెట్టారు. వాటిలో పులికి మోడలింగ్ ఎలా చేశారు? నిజం పులిలా భావించేందుకు వారు దానిలో ఎంత పెర్ఫెక్షన్ తీసుకొచ్చారన్నది కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ వీడియో విడుదల చేశారు. అలాగే.. రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) పామును పట్టుకొనే సన్నివేశాన్ని కూడా చూపించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విడుదలకు ముందు జరిగిన రాజమౌళి, తారక్, చెర్రీ సరదా ఇంటర్వ్యూలో ఈ సినిమాలో జంతువులు అటాక్ చేసే సన్నివేశాల గురించి ప్రత్యేకించి చెప్పాడు జక్కన్న. ముందుగా జంతువుల అటాక్‌ను షూట్ చేసి ఆ తర్వాత మనుషుల రియాక్షన్‌ను జతచేసినట్టు వివరించాడు. దానికి తగ్గట్టుగా.. ఈ సన్నివేశాల గ్రాఫిక్స్‌ను ఎలా చిత్రీకరించారన్నది ఈ వీడియోతో తెలుస్తోంది.


ఈ ఏడాది మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లకు పైగానే వసూళ్ళను రాబట్టింది. ఓటీటీలోనూ ఈ సినిమా నెం. 1 స్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.  అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ అద్భుతమైన నటనకు తోడు.. కీరవాణి (Keeravani) అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. ఆలియాభట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్, ఇంకా పలువురు బ్రిటీష్ నటీనటులు అద్భుతంగా అభినయించారు. జక్కన్న పెర్ఫెక్షన్ కు, ఆయన బ్రిలియన్సీకి నిదర్శనంగా నిలిచిపోయింది చిత్రం. 



Updated Date - 2022-07-13T18:26:32+05:30 IST