Kamal Haasanకి తప్ప ఏ హీరోకి ఆ ధైర్యం సరిపోదు: వెంకటేష్

ABN , First Publish Date - 2022-06-01T23:04:05+05:30 IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో

Kamal Haasanకి తప్ప ఏ హీరోకి ఆ ధైర్యం సరిపోదు: వెంకటేష్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై భారీ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను యమా జోరుగా చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘విక్రమ్’ చిత్ర  ప్రీ రిలీజ్ వేడుకను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ శిల్పక‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వహించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మాట్లాడుతూ.. ‘‘క‌మ‌ల్ సార్ ‘విక్రమ్’ ఫంక్షన్‌‌కు ర‌మ్మన్నారు అంటే.. రాకుండా ఎవ‌ర‌న్నా వుంటారా? అంతేగా! క‌మ‌ల్‌ సార్ న‌ట‌న‌కు 60 ఏళ్ళు.. కానీ మ‌న‌స్సు 16 ఏళ్ళ వ‌య‌స్సు. కమల్‌‌గారి ‘పదినారు వయదినిలే’ (pathinaru vayathinile)(పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్‌ బౌల్డ్ అయ్యాను. ఆయ‌న మాత్రం ఇంకా 16 ఏళ్ళ వ‌య‌స్సులోనే వుండిపోయారు. ‘మరో చరిత్ర’ (Maro Charitra) ప్రతి యాక్టర్‌‌కు జీపీఎస్‌ లాంటి  సినిమా.    ఇక ‘దశావతారం’ (Dasavatharam) చూస్తే అలాంటి సినిమా చేయాలంటే ఏ యాక్టర్‌‌కూ ధైర్యం సరిపోదు. ఆయ‌న నాకు ‘అపూర్వ స‌హోద‌రులు’ లాంటివారు.  ‘ఏక్‌ దూజే కేలియే’(Ek Duuje Ke Liye)తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ రోజు కమల్‌‌గారు గ్లోబల్‌ స్టార్‌ (Global Star). క‌మ‌ల్ సార్‌లో యూనిక్ క్వాలిటీ వుంది. కె.విశ్వనాథ్‌ (K Viswanath), బాల‌చంద‌ర్ (Balachander) వంటివారే కాదు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. ‘నాయ‌గ‌న్’ (Nayakan) సినిమా ఆయ‌న న‌ట‌న‌కే నాయ‌గ‌న్ చేసేసింది. ద‌క్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌కి ముందు.. మరొకటి కమల్‌ వచ్చిన తర్వాత. ఆయ‌న వ‌చ్చాక అన్ని స్టయిల్స్ మార్చేశారు. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు  చేశాను. యాక్షన్‌, కామెడీ చేశాను. సెంటిమెంట్ సినిమాలు గ‌ణేష్‌ (Ganesh), ధ‌ర్మచ‌క్రం (Dharma Chakram) వంటివి చేశాను. కానీ నాకు ఎక్కడైనా సీన్‌‌లో బ్లాంక్ వ‌స్తే క‌మ‌ల్ హాస‌న్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ చూసి చేస్తాను. ఈరోజు చాలా ఆనందంగా వుంది. లోకేష్ క‌న‌క‌రాజ్‌‌కు థ్యాంక్స్‌. క‌మ‌ల్‌ సార్‌‌తో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది. నితిన్‌ (Nithiin), సుధాక‌ర్‌రెడ్డి (Sudhakar Reddy)గారు ఈ సినిమాను విడుద‌ల‌చేస్తున్నారు. జూన్ 3న వ‌స్తుంది. అంద‌రూ చూసి.. ఘన విజయం చేకూర్చాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2022-06-01T23:04:05+05:30 IST

Read more