సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pooja Hegde: పూజా హెగ్డేకి వెంకీ లక్కీ మస్కట్ అవుతాడా?

ABN, First Publish Date - 2022-09-15T22:23:41+05:30

పాపం పూజా హెగ్డే (Pooja Hegde).. ఇప్పుడు ఫ్లాపులనే కష్టాలలో కూరుకుపోయింది. పెద్ద సినిమాలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’ అన్నీ వరసగా అపజయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపం పూజా హెగ్డే (Pooja Hegde).. ఇప్పుడు ఫ్లాపులనే కష్టాలలో కూరుకుపోయింది. పెద్ద సినిమాలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’ అన్నీ వరసగా అపజయం పాలవడంతో పూజా.. ఇప్పుడు మంచి హిట్ సినిమా కోసం చూస్తోంది. ఒక హిట్ పడితే కానీ.. ఆమె కెరీర్ మళ్లీ అందుకోదు అని పరిశ్రమలో టాక్. పూజా హెగ్డే కెరీర్ ఈమధ్య కాలంలో చూస్తే ఒక్క ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) తప్ప.. ఇంకే సినిమా కూడా బాగా ఆడాయని చెప్పుకోవడానికి లేవు. ఇన్ని వరుస అపజయాలు చూస్తున్నా, పూజా చేతిలో ఇంకా పెద్ద పెద్ద సినిమాలే వున్నాయి. ఇవన్నీ చాలా కాలం క్రితమే ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలు కాబట్టి.. ఇప్పటికైతే ఆమెనే హీరోయిన్. రెండు హిందీ సినిమాలు.. ఒకటి రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఇంకోటి సల్మాన్ ఖాన్‌ (Salman Khan)తో ఆమె చేస్తున్న సినిమాలు డిసెంబర్‌లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్. కానీ ఇంకా ఆమె షూటింగ్‌లో అడుగుపెట్టలేదు.. అక్టోబర్ 9 నుండి షూటింగ్‌లో పాల్గొంటుందని అంటున్నారు. దీనికంటే ముందు ఆమె నటించిన రెండు హిందీ సినిమాలు విడుదలవుతాయి.. ఈ రెండింటి ఫలితం మీదే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. 


తెలుగులో ఆమె అగ్రశ్రేణి  తారల్లో ఒకరుగా వున్నా.. సక్సెస్ లేకపోతే మాత్రం దర్శక నిర్మాతలు తమ తదుపరి సినిమాల్లో తీసుకోవడానికి జంకుతారు. రణ్వీర్‌తో చేస్తున్న సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతుండగా.., సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) డిసెంబర్ 30న విడుదలకానుంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh) కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అతను పూజా హెగ్డేకి అన్నగా చేస్తున్నాడు. అయితే తెలుగులో వెంకీని లక్కీ మస్కట్ అంటారు. అతను ఏదైనా సినిమాకి అతిథిగా వచ్చినా, ఏదైనా సినిమాలో చిన్న అతిథి పాత్ర చేసినా.. ఆ సినిమా కచ్చితంగా హిట్ అని అంటుంటారు. ఎందుకంటే వెంకీ ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ఉంటాడు.. అందుకని వెంకీని లక్కీ మస్కట్ అంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోరిక మేరకు వెంకటేష్ ఈ హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు అదే వెంకీ పూజా హెగ్డేకి లక్కీ మస్కట్ (Lucky Mascot) అవుతాడనిపిస్తోంది. హిట్ లేక పరితపిస్తున్న పూజా హెగ్డేకి వెంకీ వలన ఈ హిందీ సినిమా హిట్ అయితే, ఆమె కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.

Updated Date - 2022-09-15T22:23:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!