Venkatesh: సల్మాన్‌తో సెట్స్‌లో అడుగుపెట్టేది అప్పుడే..?
ABN , First Publish Date - 2022-06-01T16:44:31+05:30 IST
గత ఏడాది నారప్ప (Narappa), దృశ్యం2 (Drishyam 2) సినిమాలతో వచ్చి హిట్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తాజాగా ఎఫ్ 3 (F3) మూవీతోనూ మంచి కమర్షియల్ హిట్ దక్కించుకున్నారు.

గత ఏడాది నారప్ప (Narappa), దృశ్యం2 (Drishyam 2) సినిమాలతో వచ్చి హిట్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తాజాగా ఎఫ్ 3 (F3) మూవీతోనూ మంచి కమర్షియల్ హిట్ దక్కించుకున్నారు. ఇక ఇటీవలే రానా (Rana)తో కలిసి చేస్తున్న రానా నాయుడు (Rana Nayudu) వెబ్ సిరీస్ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేశారు. ఒకేసారి ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి డిజిటల్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అయితే, వెంకటేశ్ బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ (Salman Khan), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా ఈ నెలలోనే కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.
‘కభీ ఈద్ కభీ దివాలి’ (Kabhi Eid Kabhi Diwali) అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఫర్హాద్ సామ్జీ (Farhad Samji) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకీది కీలక పాత్రని అని సల్మాన్ - వెంకీ - పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathibabu) ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే, తాజా సమాచారం మేరకు జూన్ మొదటివారం నుంచి ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రీకరణ ప్రారంభవనుండగా..జూన్ 10 నుంచి వెంకీ జాయిన్ కాబోతున్నారట. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా రూపొందిన ఆచార్య సినిమాలో ధర్మస్థలి కోసం వేసిన టెంపుల్ సిటీ సెట్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే ధర్మస్థలి సెట్లో సల్మాన్ ‘కభీ ఈద్ కభీ దివాలి’ షూటింగ్ ప్రారంభమవబోతుందట. కాగా, సల్మాన్ మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కండలవీరుడు మన సౌత్ స్టార్స్‌తో కలిసి సినిమాలు చేసేందుకు ఆసక్తిచూపించడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.
Read more