Venkatesh - Salman Khan: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడేనా..?

ABN , First Publish Date - 2022-05-14T17:39:21+05:30 IST

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మన టాలీవుడ్ స్టార్స్ మీద ఉన్న అభిమానంతో వారు అడగగానే కాదనకుండా తమ సినిమాలలో నటించేందుకు

Venkatesh - Salman Khan: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడేనా..?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మన టాలీవుడ్ స్టార్స్ మీద ఉన్న అభిమానంతో వారు అడగగానే కాదనకుండా తమ సినిమాలలో నటించేందుకు ఒకే అంటున్నారు. ఆల్రెడీ సల్మాన్ మన టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరు - సల్మాన్‌లపై ఓ సాంగ్ మినహా మిగతా సన్నివేశాలను ఇప్పటికే ముంబైలో చిత్రీకరించారు. 


ఈ సినిమాకు మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ హిట్ సినిమా లూసీఫర్‌ (Lucifer)కు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో నయనతార (Nayanatara), సత్యదేవ్ (Sathyadev) ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, సల్మాన్ మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh)తో కలిసి కూడా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పటికే వచ్చి వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరోసారి వెంకీ - సల్మాన్ సినిమాపై ఓ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతోంది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ కాంబోలో సినిమా షూటింగ్ మొదలవబోతుందట.


వెంకీ - వరుణ్ తేజ్ - తమన్నా - మెహ్రీన్ హీరోహీరోయిన్స్‌గా నటించిన ఎఫ్ 3 ఈ నెల చివరి వారంలో రిలీజ్ కాబోతోంది. అలాగే, సల్మాన్ కూడా తన కొత్త చిత్రం టైగర్ 3ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే, కభీ ఈద్ కభీ దీవాళీ చిత్రీకరణ కోసం రంగం సిద్ధమవుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తుండగా.. మే 11న ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే జూన్ నుంచి వెంకీ సినిమా కోసం సల్లుభాయ్ డేట్స్ ఇచ్చారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. 

Updated Date - 2022-05-14T17:39:21+05:30 IST