సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khan: ‘కాటమరాయుడు’ రీమేక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో కూడా!

ABN, First Publish Date - 2022-09-08T00:39:58+05:30

ఈ సినిమా కథకి మూలం.. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమానే. అయితే సేమ్ టు సేమ్ అలాగే తీయటం లేదు కానీ, కొన్ని మార్పులు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మూల కథ మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సల్మాన్ ఖాన్ (Salman Khan) హిందీ సినిమా ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘కాటమరాయుడు’ (Katama Rayudu) కథని కొంచెం మార్చి తీస్తున్న సినిమా. ఇందులో వెంకటేష్ (Venkatesh).. పూజా హెగ్డే(Pooja Hegde)‌కి అన్నగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ చేయడానికి కారణం సల్మాన్ ఖానేనట. సల్మాన్ మరియు వెంకటేష్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వారి స్నేహం ఇప్పటిది కాదు.. చాలా కాలం నాటిది. వాళ్లిద్దరూ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ.. అనేక విషయాలపై మాట్లాడుకుంటూ వుంటారట. ఆ స్నేహంతోనే వెంకటేష్‌ని తన సినిమాలో నటించమని సల్మాన్ ఖాన్ అడిగాడట. వెంకటేష్ వెంటనే తన స్నేహితుడి కోసం ఓకే అని ఒప్పేసుకున్నాడట. అలా ఈ ఇద్దరూ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ హిందీ సినిమాలో నటిస్తున్నారు.


ఇందులో ఇంకో తెలుగు నటుడు జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కథకి మూలం.. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమానే. అయితే సేమ్ టు సేమ్ అలాగే తీయటం లేదు కానీ, కొన్ని మార్పులు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మూల కథ మాత్రం ‘కాటమరాయుడు’ నుంచే తీసుకున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. వెంకటేష్‌ని కలుస్తాడట.. అలాగే వెంకటేష్ ముంబై వెళితే సల్మాన్‌ని కలిసి వస్తాడట. వారిద్దరి మధ్య స్నేహం అంత బలంగా ఉంటుందని అంటున్నారు. అలాగే సల్మాన్ కూడా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ (GodFather) సినిమా. మొత్తం మీద.. ఇప్పుడు అందరి దృష్టి తెలుగు వాళ్ళపైనే పడింది. తెలుగు సినిమా అందుకే ఎల్లలు దాటి ఎక్కడికో వెళుతోంది.



Updated Date - 2022-09-08T00:39:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!