Superstar Krishna: వెంకటేష్ హీరో అవ్వడానికి కృష్ణగారే కారణం అని తెలుసా..

ABN , First Publish Date - 2022-11-17T16:57:07+05:30 IST

దగ్గుబాటి వెంకటేష్ హీరో గా 'కలియుగ పాండవులు' సినిమా తో ఆరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని వెనకాల ఒక పెద్ద కథ వుంది.

Superstar Krishna: వెంకటేష్ హీరో అవ్వడానికి కృష్ణగారే కారణం అని తెలుసా..

దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh Daggubati) హీరో గా 'కలియుగ పాండవులు' (Kaliyuga Pandavulu) సినిమా తో ఆరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని వెనకాల ఒక పెద్ద కథ వుంది. వెంకటేష్ నాన్నగారు దగ్గుబాటి రామానాయుడు (Ramanaidu Daggubati) అప్పటికే ఒక పెద్ద నిర్మాత కదా, అతను కృష్ణ గారితో ఒక సినిమా చేయాల్సి వుంది. కృష్ణ గారు ఆ సమయం లో చాలా బిజీ గా వుండేవారు. రామానాయుడు గారు చాలా సార్లు అడిగాక ఒకరోజు సరే అన్నారు కృష్ణగారు. పరుచూరి సోదరులు ని తీసుకొని రామానాయుడు గారు కృష్ణగారి దగ్గరికి వెళ్ళి ఈ 'కలియుగ పాండవులు' కథ వినిపించారు. కె రాఘవేంద్ర రావు దర్శకుడు. కృష్ణగారికి కథ బాగా నచ్చింది, కానీ నాయుడు గారితో, మీరు ఈ సినిమా ఇంకో నిర్మాత తో కూడా కలిపి చేయాలి, ఎందుకంటే ఆ నిర్మాత కి కూడా నేను ఒక సినిమా చేసి పెడతా అన్నాను, అందుకని మీ ఇద్దరు కలిపి ఈ సినిమాని నిర్మించండి అని చెప్పారు కృష్ణగారు. 


దానికి నాయుడుగారు వొప్పుకోలేదు. నేను సోలో గా ప్రొడ్యూస్ చేస్తా, వేరే వాళ్ళతో కలిపి చేయను, వీలయితే నాకు ఒక్కడికే ఇవ్వండి, లేదంటే నేను డ్రాప్ అయిపోతాను అని చెప్పారు నాయుడు గారు. దానికి కృష్ణగారు, అయితే ఇంకో సినిమా నేను సోలోగా మీకు డేట్స్ ఇస్తా అంతవరకు ఆగమని చెప్పి నాయుడు గారితో 'కలియుగపాండవులు' సినిమా చేయలేదు. అప్పటికే చాలా నెలలు కృష్ణ గారి డేట్స్ కోసం ఎదురు చూసిన నాయుడు గారికి కోపం వచ్చి, కథ బాగుంది, రెడీ గా వుంది ఏమి చేయాలి అని ఆలోచించి, అమెరికాలో వున్న కుమారుడు వెంకటేష్ కి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా ఇండియా రా అని చెప్పారు. వెంకటేష్ కి అప్పటికి ఇంకా ట్రైనింగ్ లాంటిది ఏమి ఇవ్వలేదు, సినిమా ఫీల్డ్ కి రావాలా వద్దా అని కూడా ఇంకా అనుకోలేదు. ఆ టైమ్ లో నాయుడు గారు ఫోన్ చేసి ఇండియా వచ్చేయమని, ఒక నెల మాత్రమే ట్రైనింగ్ ఇప్పించి, సినిమా ఆరంగేట్రం చేయాలని చెప్పి, 'కలియుగపాండవులు' సినిమాని వెంకటేష్ తో చేశారు. ఆ విధంగా వెంకటేష్ మొదటి సినిమా చేయడం అది పెద్ద హిట్ అవటం, ఆ తరువాత అతను కంటిన్యూ చేయడం, ఈరోజు తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకోవటం జరిగినది. వెంకటేష్ మొదటి సినిమా వెనక అసలు కథ అదీ!

Updated Date - 2022-11-17T16:57:07+05:30 IST