సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణ‌లో ‘777 Charlie’.. ట్రైలర్ విడుదల

ABN, First Publish Date - 2022-05-16T23:21:46+05:30

‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) వైజ్‪గా ప్రేక్షకులను ఆకర్షించిన క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). ఆయన హీరోగా నటించిన తాజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana) చిత్రంతో పాన్ ఇండియా (Pan India) వైజ్‪గా ప్రేక్షకులను ఆకర్షించిన క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం  ‘777 చార్లి’ (777 Charlie). ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా న‌టిస్తూ.. జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిర‌ణ్ రాజ్‌.కె (Kiran Raj. K) ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టాలీవుడ్‪కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) బ్యానర్‌పై రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పిస్తున్నారు. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, క‌న్నడ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‪ని సోషల్ మీడియా వేదికగా విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), రానా దగ్గుబాటి, సాయిపల్లవి (Sai Pallavi) విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, చిత్రయూనిట్‪కు మంచి పేరు తెచ్చేలా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని వారు కోరారు.


చిత్ర కథ విషయానికి వస్తే.. ‘‘ధర్మ (రక్షిత్ శెట్టి) లోకం వేరు.. నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్రపంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో చార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది. ముందు ధ‌ర్మకి చార్లి అంటే అస్సలు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో పెద్ద ప్రమాదం నుండి బయటపడిన ధర్మకు.. చార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌ను చూసి మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్దరి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది. అలాంటి చార్లి, ధ‌ర్మ ఎందుకు కాశ్మీర్‌కి వెళ‌తారు. చార్లిని వెతుక్కుంటూ వెళ్లిన ధ‌ర్మకు అక్కడ ఎదురైన ప‌రిస్థితులు ఏంటి?’’ అనే విష‌యాలు తెలుసుకోవాలంటే జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘777 ఛార్లి’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్.. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటూ.. టాప్‪లో ట్రెండ్ అవుతోంది. 



Updated Date - 2022-05-16T23:21:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!