వీరయ్య రాక ఖరారు
ABN , First Publish Date - 2022-12-08T10:33:10+05:30 IST
సంక్రాంతి బరిలోకి చిరంజీవి ఆగమనం అధికారికంగా ఖరారైంది. ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి సందర్భంగా...
సంక్రాంతి బరిలోకి చిరంజీవి ఆగమనం అధికారికంగా ఖరారైంది. ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలవుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం వెల్లడించింది. చిరంజీవి మాస్‌లుక్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రుతీహాసన్ కథానాయిక. బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.