సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Veera Simha Reddy: ‘సుగుణ సుందరి’ వచ్చేస్తోంది

ABN, First Publish Date - 2022-12-13T19:54:15+05:30

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న..

Veera Simha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), శృతిహాసన్ (Shruti Haasan) హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). 2023 సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 12న విడుదల గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ (Suguna Sundari)ని డిసెంబర్ 15న విడుదల చేసేందుకు టైమ్ లాక్ చేసినట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ను అధికారికంగా ప్రకటించారు.

‘వీరసింహారెడ్డి’ సినిమాలోని సుగుణ సుందరి సాంగ్ డిసెంబర్ 15 ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన లవ్లీ పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించగా.. శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది. ఈ డ్యూయట్‌లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించబోతున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఎస్ థమన్ (S Thaman) ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ (Jai Balayya) మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే డ్యూయట్ సుగుణ సుందరి కూడా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకో పాటని షూట్ చేయాలని మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

Updated Date - 2022-12-13T22:34:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!