Varun tej 13: బాలీవుడ్ ఎంట్రీ!
ABN , First Publish Date - 2022-09-20T01:54:48+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా నటించబోతున్న 13వ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. ‘ఆకాశాన్ని తాకేందుకు..’ అంటూ వరణ్‌తేజ్ తన తదుపరి చిత్రం గురించి ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej 13) బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా నటించబోతున్న 13వ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. ‘ఆకాశాన్ని తాకేందుకు’ అంటూ వరణ్‌తేజ్ తన తదుపరి చిత్రం గురించి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సోనీ పిక్చర్స్ (Sony pictures)ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ (Sakthi pratap singh)దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ సినిమా. వరుణ్ తేజ్ తల్లి పద్మజా కొణిదెల కెమరా స్విచ్ఛాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉండబోతోంది. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా లేయర్స్ ఉన్న పాత్ర ఇది. ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాను. అయితే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఈ ఏడాది నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రం 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది’’ అని అన్నారు.