Varun Tej - Praveen Sattaru Combo : సెట్స్‌పైకి వెళ్ళేది అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-05-23T14:40:36+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గత చిత్రం ‘గని’ (Ghani) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’ ( F3 ) విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Varun Tej - Praveen Sattaru Combo :  సెట్స్‌పైకి వెళ్ళేది అప్పుడేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గత చిత్రం ‘గని’ (Ghani) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’ ( F3 ) విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. యస్వీసిసి బ్యానర్ పై బీవీయస్ యన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చ్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది.  ఈ సినిమాకి నాగబాబు (Nagababu) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ (Mickey j mayor) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానుందనే వార్తలొస్తున్నాయి.


ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) తో ‘ది ఘోస్ట్’ (The Ghost) అనే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రవీణ్ సత్తారు ( Praveen Sattaru ). ఇందులో నాగ్ ఎఫ్‌బీఐ (FBI) ఏజెంట్‌గా నటిస్తుండగా.. కథానాయికగా సోనాల్ చౌహాన్ మెరవబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే..  వరుణ్ తేజ్ (Varun Tej) సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాతనే ‘ది ఘోస్ట్’ మూవీ విడుదల ఉంటుందని చెబుతున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. అలాగే.. వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ ( F3 ) చిత్రం కూడా కొద్దిరోజుల్లోనే విడుదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ .. ప్రవీణ్ చిత్రానికి షిఫ్ట్ అవుతాడని టాక్.   


వరుణ్ తేజ్ ( Varun Tej ) కెరీర్ లోనే  మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా మార్కెట్ తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించి ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాపై మరిన్ని వివరాలు వచ్చే నెల్లో తెలియబోతున్నాయి. 

Updated Date - 2022-05-23T14:40:36+05:30 IST