సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varsha Bollamma: ‘ఎన్ఠీఆర్ నటనకి అభిమానిని నేను’

ABN, First Publish Date - 2022-10-03T22:45:57+05:30

వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) తెలుగులో 'చూసీ చూడగానే' (Choosee Choodagane) అనే సినిమాతో పరిచయం అయింది. అంతకు ముందు చాలా తమిళ్, మలయాళం (Malayalam) సినిమాలు చేసింది. మొదటి తెలుగు సినిమా ప్లాప్ అయినా, వర్ష బొల్లమ్మ మంచి నటి అని అనిపించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) తెలుగులో 'చూసీ చూడగానే' (Choosee Choodagane) అనే సినిమాతో పరిచయం అయింది. అంతకు ముందు చాలా  తమిళ్, మలయాళం (Malayalam) సినిమాలు చేసింది. మొదటి తెలుగు సినిమా ప్లాప్ అయినా, వర్ష బొల్లమ్మ మంచి నటి అని అనిపించుకుంది. ఆమెకి మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' (Middleclass Melodies), ఇందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda brother Anand) తమ్ముడు ఆనంద్ పక్కన చేసింది. కానీ ఈ సినిమా థియేటర్స్ లో విడుదల  అవలేదు, ఓటిటి లో విడుదల అయింది. తరువాత చేసిన 'పుష్పక విమానం' (Pushpaka Vimanam) మరియు 'స్టాండ్ అప్ రాహుల్' (Stand Up Rahul) రెండూ పోయాయి. 


ఇప్పుడు వర్ష 'స్వాతి ముత్యం' (Swathi Mutyam) అనే సినిమాలో బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) పక్కన చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు (Bellamkonda Sai Srinivas brother Ganesh) గణేష్. ఇలా తమ్ముళ్ల పక్కన చేస్తోంది వర్ష. అదే విషయం ఆమెని కూడా చాలామంది అడుగుతుంటారుట.  ఏంటి ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. "నేను కావాలని ఈ సినిమాలు ఎంపిక చేసుకోలేదు. అలా కుదురుతుంది . వాళ్ళు వైవిధ్యమయిన సబ్జక్ట్స్ తో  వస్తున్నారు,అందుకని నన్ను తీసుకున్నారేమో" అంటోంది వర్ష. 



మరి వర్ష డ్రీం రోల్ ఏంటి అని అడిగితే, ఆమె చెప్పే సమాధానం ఆసక్తికరంగా వుంది. నెగటివ్ షేడ్స్ వున్న సైకో పాత్ర దొరికితే అలాంటిది చెయ్యాలని వుంది అంటోంది. వర్ష ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అనుకునే పాత్ర చెయ్యాలని వుంది అని చెప్పింది. అది ఆమె డ్రీం రోల్ అంట. ఈమె ఇటు తెలుగు, తమిళ్, మలయాళం లో చేస్తోంది కదా, మరి ఈ నెంబర్ గేమ్ గురించి ఏమంటోందో చూడండి. ఆ నెంబర్ గేమ్ వేపు చూడదట అసలు. నటిగా మంచి పేరు తెచ్చుకుంటే చాలు అంటోంది. కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాను, కానీ అందులో నటనకి ప్రాధాన్యం ఉండాలి అని చెప్తోంది. 

ఆమె అభిమాన నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ అని చెప్తోంది. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో కొమరం భీముడొ (Komaram Bheem) పాటలో జూనియర్ ఎన్ఠీఆర్ (Junior NTR) నటన (Performance) బాగా నచ్చిందిట. ఆమె అతని నటనకి అభిమాని అని చెప్తోంది. 

Updated Date - 2022-10-03T22:45:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!