‘ఆర్ఆర్ఆర్’ టైమ్ వేస్ట్ సినిమా.. అన్న కేఏ పాల్‌‌పై వర్మ రియాక్షన్ చూశారా?

ABN , First Publish Date - 2022-04-02T02:26:10+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. కేఏ పాల్ టైమ్ వేస్ట్ సినిమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంచలనాలకి కేంద్రబిందువు అయిన వర్మ అదిరిపోయేలా రియాక్షన్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్..

‘ఆర్ఆర్ఆర్’ టైమ్ వేస్ట్ సినిమా.. అన్న కేఏ పాల్‌‌పై వర్మ రియాక్షన్ చూశారా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. కేఏ పాల్ టైమ్ వేస్ట్ సినిమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంచలనాలకి కేంద్రబిందువు అయిన వర్మ అదిరిపోయేలా రియాక్షన్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అటువంటి చిత్రాన్ని.. కేఏ పాల్ టైమ్ వేస్ట్ సినిమా అని, అసలు ఈ సినిమా గురించి నాకేం తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.


ఫేస్ బుక్ లైవ్‌లో పాల్గొన్న కేఏ పాల్‌ని.. ఒక నెటిజన్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూశారా? అని అడిగారు. దీనికి కేఏ పాల్ సమాధానమిస్తూ.. ‘‘అదెక్కడి మూవీ అయ్యా బాబూ.. రోజుకో మూవీ వస్తున్నట్టుంది. మీకు ఇక పనిపాట్లూ ఏమీ లేవా? రోజూ మూవీస్ చూడడమేనా? టైమ్ వేస్ట్ చేయడమేనా? ఎవరో మూవీ చేస్తారు.. మీరు వాటిని చూస్తారు.. టైమ్ వేస్ట్ తప్ప.. దానివల్ల వచ్చే లాభం ఏమిటి? ఏవైనా మీనింగ్‌ఫుల్ మూవీస్ ఉంటే చూడాలి. ఈ మూవీ గురించి నేను వినలేదు.. నాకు తెలియదు. వారానికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారంట తెలుగులో.. నిజమేనా? అది..’’ అని చెప్పుకొచ్చారు.


ఇక కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా స్పందించారంటే..‘నీ మొహం రా’.. అంటూ ఘాటుగా ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. దీనికి నెటిజన్లు కూడా వంత పాడుతున్నారు. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైనప్పటి నుండి వర్మ.. ఆ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అలాంటిది కేఏ పాల్ అలా షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. వర్మ ఈ విధంగా స్పందించారు.Updated Date - 2022-04-02T02:26:10+05:30 IST