సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘చేజింగ్’కి సిద్ధమైన Varalaxmi Sarathkumar

ABN, First Publish Date - 2022-05-16T23:57:58+05:30

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చేజింగ్’ (Chasing). ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం.. కె. వీరకుమార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చేజింగ్’ (Chasing). ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం.. కె. వీరకుమార్ (K Veerakumar) దర్శకత్వంలో జి. వెంకటేశ్వరరావు (G Venkateswara Rao), మదిలగన్ మునియండి (Madilagan Muniyandi) నిర్మించారు. పరిటాల రాంబాబు (Paritala Rambabu) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకులు వి. సముద్ర (V Samudra), సూర్యకిరణ్ (Surya Kiran).. నిర్మాత రామసత్యన్నారాయణ (Rama SatyaNarayana) సంయుక్తంగా ఈ ట్రైలర్‪ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుండు ప్రభాకర్ (Gundu Prabhakar) మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి ఇంత మంది హాజరవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమాకి ఎంతమంది సహకారం ఉందో. ఖచ్చితంగా ‘చేజింగ్’ మంచి సినిమా. నిర్మాతలు గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించారనేది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాని వెనకుండి నడిపించింది పరిటాల రాంబాబు. ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అని అన్నారు. దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు, దర్శకత్వం వహించిన దర్శకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిటాల రాంబాబు ఆధ్వర్యంలో ఈ చిత్రం బాగా వచ్చిందని విన్నాను. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్‌తో నేను కూడా పనిచేశాను. మంచి టాలెంటెడ్ పర్సన్. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.


నిర్మాత రామసత్యన్నారాయణ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతలు కొత్తవారైనా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు మంచి అనుభవజ్ఞుడు. ఆయన ఆర్గనైజేషన్‌లో సినిమా రెడీ అవుతుంది కాబట్టి.. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇండస్ట్రీ నుండి కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఉంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది.. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు..’’ అని తెలపగా.. దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని నేను చూడటం జరిగింది. చాలా రిచ్‌గా తీశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. పరిటాల రాంబాబుగారి గురించి చెప్పాలంటే.. వాళ్ల అబ్బాయి అండర్ 19 క్రికెట్‌లో ఉన్నారు. అతని కంటే కూడా రాంబాబు చాలా స్పీడ్‌గా ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడితో పాటు.. నటులు రంగరాజు, అప్సర్ ఆజాద్.. దర్శకుడు నగేష్ నారదాసి వంటివారు మాట్లాడారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-05-16T23:57:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!