Varalakshmi Sarathkumar: సరోగసీ కాంప్లికేటెడ్ కాదు

ABN , First Publish Date - 2022-10-30T00:45:12+05:30 IST

క్రాక్‌ సినిమాలో జయమ్మ పాత్రతో టాలీవుడ్‌ ప్రేక్షకులను తనవైపు తిప్పుకొంది తమిళ కథానాయిక వరలక్ష్మీ శరత్‌కుమార్‌. అక్కడి నుంచి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘యశోద’.

Varalakshmi Sarathkumar: సరోగసీ కాంప్లికేటెడ్ కాదు

క్రాక్‌ సినిమాలో జయమ్మ (Jayamma)పాత్రతో టాలీవుడ్‌ ప్రేక్షకులను తనవైపు తిప్పుకొంది తమిళ కథానాయిక వరలక్ష్మీ శరత్‌కుమార్‌(Varalakshmi Sarathkumar). అక్కడి నుంచి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘యశోద’(Yashoda). సమంత (Samantha)ముఖ్య పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లో... 


కథ వినగానే ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ దర్శకులను అడిగాను. ట్రైలర్‌లో గమనిస్తే నా క్యారెక్టర్‌ చాలా కామ్‌గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్‌ గురించి మరింత రివీల్‌ అవుతుంది. గ్రే షేడ్స్‌ ఉన్న రోల్‌ చేశా. సమంత క్యారెక్టర్‌, నా క్యారెక్టర్‌ మధ్య ఉన్న రిలేషన్‌... మా కథలు ఆసక్తిగా ఉంటాయి. ఇందులో నాది డాక్టర్‌ కాదు. సరోగసీ ఫెసిలిటీ సెంటర్‌ హెడ్‌గా కనిపిస్తా. ఆమె చాలా రిచ్‌. డబ్బులంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్‌ స్టైల్‌, ఇతర అంశాలకు పూర్తి విరుద్థంగా ఈ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. కథ పరంగా నాకు పెద్దగా సవాళ్లేమీ లేవు. సమంతలా నేను ఫైట్స్‌ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్‌ చేశాను. ఒక డిఫరెంట్‌ రోల్‌ చేేసటప్పుడు నాకు నేను ఛాలెంజ్‌ చేసుకుంటా. ఆ విధంగా నాకు ఛాలెంజ్‌ అంతే! 


డెప్త్‌ నచ్చింది... 

నా పాత్రలో ఉన్న డెప్త్‌ నాకు బాగా నచ్చింది. ‘యశోద’ క్యారెక్టర్‌ కూడా వెరీ స్ర్టాంగ్‌. సమంత చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్స్‌ కంటే కథ నా ఫేవరెట్‌. రావు రమేశ్‌, నాకు మధ్య ఉన్న సీన్స్‌ బావుంటాయి. అలాగే... ఉన్ని ముకుందన్‌, నాకు మధ్య సీన్స్‌ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులం మాత్రమే! 


టికెట్‌ రేటుకు వాల్యూ ఇచ్చేలా...

సమంతతో పాటు నా క్యారెక్టర్‌ కూడా ప్యారలల్‌గా ఉంటుంది. సినిమాలో లీడ్‌ రోల్‌ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. నాది సెకండ్‌ లీడ్‌ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరిలో మంచి చెడులను ఈ చిత్రంలో  చూపించారు. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్‌గా ఎవరినీ చూడలేదు. కథకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్‌ కోసం చాలా రీసెర్చ్‌ చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం అన్ని సినిమాకు ప్లస్‌ అవుతాయి. మీరు పెట్టే టికెట్‌ రేటుకు వాల్యూ ఇచ్చేలా సినిమా ఉంటుంది. శివలెంక కృష్ణ ప్రసాద్‌ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్‌ వేశారు. 


కాంప్లికేటెడ్‌ కాదు.

సరోగసీ కాంప్లికేటెడ్‌ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్‌ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్‌ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడంలేదు. ఇది ఫిక్షనల్‌ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని చెబుతుంది. 


12 ఏళ్ల క్రితమే తెలుసు..

నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. సినిమాలో తనకు సీరియస్‌ సీన్స్‌ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్‌ గ్యాప్‌ వస్తే జోక్స్‌ వేేసదాన్ని. తను నవ్వేది. ‘షాట్‌ ముందేఎందుకు ఇటువంటి జోక్స్‌ వేస్తావ్‌?’ అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. సమంత స్ట్రాంగ్‌ విమెన్‌. పాత్రలో జీవించింది. పవర్‌ ఫుల్‌ రోల్‌ బాగా చేసింది.


డేట్స్‌ లేవు...

‘క్రాక్‌’లో జయమ్మ తర్వాత తెలుగులో నాకు మంచి రోల్స్‌ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్‌ లేవు. నాకు స్టీరియో టైప్‌ రోల్స్‌ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘శబరి’ చేస్తున్నా. ‘వీర సింహా రెడ్డి’లో నాది క్రేజీ క్యారెక్టర్‌. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.


Updated Date - 2022-10-30T00:45:12+05:30 IST