మెడికో థ్రిల్లర్‌ కథతో

ABN , First Publish Date - 2022-12-31T01:49:18+05:30 IST

అశ్విన్‌బాబు, పాలక్‌ లాల్వాని జంటగా రూపొందుతున్న చిత్రం ‘వచ్చినవాడు గౌతం’. నాజర్‌, ‘కాంతారా’ ఫేం అచ్యుత్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

మెడికో థ్రిల్లర్‌ కథతో

అశ్విన్‌బాబు, పాలక్‌ లాల్వాని జంటగా రూపొందుతున్న చిత్రం ‘వచ్చినవాడు గౌతం’. నాజర్‌, ‘కాంతారా’ ఫేం అచ్యుత్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎం. ఆర్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డీఎ్‌సఆర్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలి షాట్‌కు నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. బెల్లంకొండ సురేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక మెడికో థ్రిల్లర్‌. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు

Updated Date - 2022-12-31T01:49:23+05:30 IST

Read more