Upendra: అనారోగ్య వార్తలపై స్పందించిన హీరో..

ABN , First Publish Date - 2022-11-25T20:38:43+05:30 IST

కొత్త పాత్రలు, వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే నటుడు ఉపేంద్ర (Upendra). డబ్బింగ్ చిత్రాలు ‘రా’, ‘ఉపేంద్ర’ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

Upendra: అనారోగ్య వార్తలపై స్పందించిన హీరో..

కొత్త పాత్రలు, వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఉపేంద్ర (Upendra). డబ్బింగ్ చిత్రాలు ‘రా’, ‘ఉపేంద్ర’ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ వంటి మూవీస్‌లో కీలక పాత్రలు పోషించాడు. ఈ స్టార్ హీరో అస్వస్థతకు లోనయ్యాడని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వెలువడ్డాయి. శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరాడని సోషల్ మీడియాలో వదంతులు షికార్లు కొట్టాయి. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లనున్నాడని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై హీరో ఉపేంద్ర స్పందించాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పాడు. ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.     

 

ఉపేంద్ర ప్రస్తుతం ‘యూఐ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్ నుంచి ఓ వీడియోను షేర్ చేశాడు. ‘‘ప్రస్తుతం నేను షూటింగ్ స్పాట్‌లో ఉన్నాను. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో సహా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. నాకు ఏం కాలేదు. నా ఆరోగ్యం బాగానే ఉంది. దుమ్ము ఎక్కువగా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అసత్య ప్రచారాలు చేయకండి. ఇప్పుడు కూడా నేను షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని ఉపేంద్ర చెప్పాడు. ఇక ఉపేంద్ర కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘బుద్ధిమంత 2’, ‘యూఐ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.



Updated Date - 2022-11-25T20:38:43+05:30 IST