అన్‌స్టాపబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-06-01T11:05:01+05:30 IST

వి.జె. సన్నీ, సప్తగిరి, ఆక్షాఖాన్‌, పృధ్వీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న నూతన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’ మంగళవారం ప్రారంభమైంది...

అన్‌స్టాపబుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌

వి.జె. సన్నీ, సప్తగిరి, ఆక్షాఖాన్‌, పృధ్వీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న నూతన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’ మంగళవారం ప్రారంభమైంది. హీరో వి.జె. సన్నీపై చిత్రీకరించిన  ముహూర్తపు సన్నివేశానికి రచయిత విజయేంద్రప్రసాద్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు బి. గోపాల్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ‘బుర్రకథ’ ఫేం డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రంజీత్‌రావ్‌ బి. నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సీనియర్‌ నటులు, టెక్నీషియన్లతో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. దసరాకు సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సన్నీ నటన ఈ సినిమాకు ప్రధానాకర్షణ. ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్‌ చేస్తాం’ అని చెప్పారు. సన్నీ మాట్లాడుతూ ‘ఈసినిమాకు మంచి టీం కుదిరింది. నటుడిగా నా కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుంద’న్నారు. 


Updated Date - 2022-06-01T11:05:01+05:30 IST

Read more