సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'లైగర్‌'పై అనన్య ఆశలు..

ABN, First Publish Date - 2022-01-12T17:53:54+05:30

'లైగర్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. అందుకు కారణం ఇది పాన్ ఇండియన్ సినిమా కావడమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'లైగర్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. అందుకు కారణం ఇది పాన్ ఇండియన్ సినిమా కావడమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇటీవలే ఆగస్టు 25న 'లైగర్' చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..అని హీరోయిన్ అనన్య పాండే ఎదురుచూస్తోందట. ఒకేసారి నాలుగు సౌత్ భాషలలో పరిచయం కాబోతుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ఇటీవల మీడియా సమావేశంలో అనన్య చెప్పుకొచ్చింది. 'లైగర్' సినిమా గనక హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో మంచి క్రేజ్ దక్కుతుందని ఆశపడుతోంది. అంతేకాదు, ఈ సినిమా తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్స్ వస్తాయని చాలా నమ్మకంగా ఉంది. చూడాలి మరి ఈ 'లైగర్' బ్యూటీ సౌత్‌లో ఏమాత్రం సక్సెస్ సాధిస్తుందో.  

Updated Date - 2022-01-12T17:53:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!