ఉక్కు సత్యాగ్రహంలో...

ABN , First Publish Date - 2022-11-26T07:06:54+05:30 IST

పి.సత్యారెడ్డి నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఆయనే దర్శక నిర్మాత. మేఘన లోకేశ్‌, ఎంవివి సత్యనారాయణ, గద్దర్‌ కీలక పాత్రలు పోషించారు.

ఉక్కు సత్యాగ్రహంలో...

పి.సత్యారెడ్డి నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఆయనే దర్శక నిర్మాత. మేఘన లోకేశ్‌, ఎంవివి సత్యనారాయణ, గద్దర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఓ గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ప్రశ్నించడం కళాకారుడి హక్కు. సత్యారెడ్డి కూడా అలా ప్రశ్నించే సినిమానే తీశాడు. ప్రైవేటీకరణపై పోరాడే సినిమా ఇద’’న్నారు. ‘‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఈ సమస్య ఆంధ్రులదే కాదు.. తెలుగువాళ్లందరిదీ’’ అన్నారు గద్దర్‌. ఈ చిత్రానికి కోటి సంగీతాన్ని అందించారు. 

Updated Date - 2022-11-26T07:06:54+05:30 IST

Read more