Ponniyin Selvan 1: కుందవాయిగా త్రిష లుక్‌ అదిరింది!

ABN , First Publish Date - 2022-07-08T01:21:07+05:30 IST

కోలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం (maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ( Ponniyin Selvan 1). విక్రమ్‌, కార్తీ, జయరామ్‌, త్రిష, ఐశ్వర్యారాయ్‌, శోభితా ధూళిపాల, ఐశ్వర్యలక్షీ, విక్రమ్‌ ప్రభు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.

Ponniyin Selvan 1: కుందవాయిగా త్రిష లుక్‌ అదిరింది!

కోలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం (maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ( Ponniyin Selvan 1).  విక్రమ్‌, కార్తీ, జయరామ్‌, త్రిష, ఐశ్వర్యారాయ్‌, శోభితా ధూళిపాల, ఐశ్వర్యలక్షీ, విక్రమ్‌ ప్రభు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం చిత్రీకరణ శరవేగంగా గ్రాండ్‌ లెవల్లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, కార్తీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. గురువారం త్రిష (Trisha as kundavai)లుక్‌ను మణిరత్నం వదిలారు. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కుందవాయి పాత్రలో త్రిష లుక్‌ అదిరిపోయిందని అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో టీజర్‌, ట్రైలర్‌లతో అలరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  (Ponniyin Selvan 1 on 30 sepetember)




Updated Date - 2022-07-08T01:21:07+05:30 IST