సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla On SVP: ‘సర్కారు వారి పాట’ చూసి బండ్లన్న ట్వీట్.. ఈ కరుడుగట్టిన PSPK ఫ్యాన్ ఏమన్నాడంటే..

ABN, First Publish Date - 2022-05-13T23:16:11+05:30

Mahesh Babu తాజా చిత్రం ‘SarkaruVaariPaata’ మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది. సినిమా చూసిన కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Mahesh Babu తాజా చిత్రం ‘SarkaruVaariPaata’ మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది. సినిమా చూసిన కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు మాత్రం పస లేదంటూ పెదవి విరుస్తున్నారు. బయట టాక్ ఎలా ఉన్నా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మాత్రం ‘సర్కారు వారి పాట’ సినిమాపై పాజిటివ్ టాకే నడుస్తోంది. దర్శకుడు పరశురామ్, మహేశ్ బాబు కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన SVP సినిమా చూసి ఒక మెగా ఫ్యామిలీ వీరాభిమాని, పవన్ భక్తుడు స్పందించాడు. ఆ టాలీవుడ్ ప్రముఖుడెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. నెటిజన్లు సరదాగా బండ్లన్న అని పిలుచుకునే ఈ టాలీవుడ్ నిర్మాత ‘సర్కారు వారి పాట’ సినిమా చూశాడు. చూశాక తనకు కలిగిన అనుభూతిని ట్వీట్ చేశాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు Blockbuster Performanceతో అలరించారని బండ్ల ట్వీట్ చేశాడు. సినిమా విజయం సాధించినందుకు మహేశ్‌తో పాటు దర్శకుడు పరశురాంకు, థమన్, కీర్తి సురేష్, చిత్ర నిర్మాణంలో భాగమైన ప్రొడక్షన్ సంస్థలకు శుభాకాంక్షలు తెలిపాడు. మొత్తం మీద చెప్పాలంటే ఈ పవర్ స్టార్ భక్తుడు మహేశ్ బాబు సినిమా హిట్ అని చెప్పేశాడు.


కానీ.. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ట్విట్టర్ వేదికగా మహేశ్ ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు మధ్య వార్ నడుస్తోంది. PAN ఇండియా మూవీ Pushpa ఫస్ట్ డే గ్రాస్ రూ.71 కోట్లు వస్తే.. తమ హీరో మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ PAN ఇండియా సినిమా కాకపోయినప్పటికీ రూ.75 కోట్లు డే 1 గ్రాస్ సాధించిందని మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. SVP సినిమా నిర్మాణ సంస్థలు తొలి రోజు గ్రాస్‌కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌పై ALL TIME RECORD (FOR A REGIONAL MOVIE) అని ప్రచారం చేసుకోవడం గమనార్హం. మెగా ఫ్యాన్స్‌కు, మహేశ్ ఫ్యాన్స్‌కు మధ్య నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్న సందర్భంలో కరుగుగట్టిన మెగా అభిమాని బండ్ల గణేష్ SVP సినిమాపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం.

Updated Date - 2022-05-13T23:16:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!