మొదటి సారి భార్య, కొడుకు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన Thaman.. భార్యతో కలిసి స్టేజ్ షో చేయడంపై..
ABN , First Publish Date - 2022-05-18T22:27:50+05:30 IST
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోని సినిమాలకు సంగీతం అందిస్తూ..వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman). తన నేపథ్య సంగీతంతోను ప్రేక్షకుల్ని

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోని సినిమాలకు సంగీతం అందిస్తూ..వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman). తన నేపథ్య సంగీతంతోను ప్రేక్షకుల్ని మైమరిపిస్తున్నాడు. వరుసగా హిట్లను అందిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ (Godfather), ఆర్సీ-15(RC15) చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మొదటిసారి తన భార్య, కొడుకు గురించి ఆసక్తికర విషయాలను అభిమానులకు అభిమానులకు చెప్పాడు.
తమన్ ప్లే బ్యాక్ సింగర్ శ్రీ వర్ధిని(Sri Vardhini)ని పెళ్లి చేసుకున్నాడు. గతంలో మణిశర్మ(Mani Sharma), యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja)వంటి వారితో ఆమె పనిచేసింది. తమన్ కంపోజింగ్లోను నాలుగు పాటలు పాడింది. తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం ఇష్టం లేదని తమన్ చెప్పాడు. ఆమె వాయిస్ బాగుంటుందని దర్శకుడు, నిర్మాతలకు అనిపిస్తే పాడిస్తారని తెలిపాడు. ఆమెకు వేదికను కల్పించడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన భార్యతో కలసి స్టేజ్ షోలు చేయాలనే ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. కానీ, అంతకు ముందే రెండు, మూడు సూపర్ హిట్ గీతాలను అలపించాలని వెల్లడించాడు. తమన్ కొడుకు అచ్యుత్(Achyuth) ఇంటర్ చదువుతున్నాడు. ‘‘నా ట్యూన్లను మొదటగా అతడే వింటాడు. వాటిపై తన అభిప్రాయన్ని చెబుతాడు. సంగీతానికీ సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటంలో అతడికీ మంచి పట్టు ఉంది. పియానోలో నాలుగవ గ్రేడ్ పూర్తి చేశాడు. అతడు ఏ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటాడో నాకు తెలియదు’’ అని తమన్ స్పష్టం చేశాడు.