సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

TFI:ప్యాకేజీ ఫార్ములా వర్కవుట్‌ అవుతుందా?

ABN, First Publish Date - 2022-08-23T22:46:47+05:30

తెలుగు చిత్ర పరిశ్రమను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి నిర్మాతలంతా కలిసి రిపేర్లు మొదలుపెట్టారు. పారితోషికాలు, టికెట్‌ రేట్లు, బడ్జెట్‌ కంట్రోల్‌, కార్మికుల సమస్యలు, డిజిటల్‌ రిలీజ్‌లు ఇలా ఒకటా రెండా.. చాంతాడంత సమస్యలు ఇండస్ట్రీని నలిపేస్తున్నాయి. ‘తెలుగు చిత్రాల ప్రొడక్షన్‌ కాస్ట్‌ బాగా పెరిగిపోతోంది. బడ్జెట్‌ లెక్క దాటుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్ర పరిశ్రమను (Tollywood)ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి నిర్మాతలంతా కలిసి రిపేర్లు మొదలుపెట్టారు. పారితోషికాలు(heroes remuneration), టికెట్‌ రేట్లు, బడ్జెట్‌ కంట్రోల్‌ (budget control), కార్మికుల సమస్యలు, డిజిటల్‌ రిలీజ్‌లు ఇలా ఒకటా రెండా.. చాంతాడంత సమస్యలు ఇండస్ట్రీని నలిపేస్తున్నాయి. ‘తెలుగు చిత్రాల ప్రొడక్షన్‌ కాస్ట్‌ బాగా పెరిగిపోతోంది. బడ్జెట్‌ లెక్క దాటుతోంది.  హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్‌ పేరుతో బాదేస్తున్నారు. దర్శకుడు పర్‌ఫెక్షన్‌ పేరుతో తీసిందే తీసి.. మరింత భారం పెంచుతున్నాడు. ఇంతా చేసి సినిమా హిట్టయితే.. నిర్మాతకు మిగిలేది అంతంత మాత్రమే! కొన్ని సినిమాల విషయంలో అది కూడా ఉండదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆస్తులు కూడా అమ్ముకోవాలి నిర్మాతలు రూ.30 కోట్లు, రూ50 కోట్లు పెట్టి సినిమా తీస్తే బాగుపడేది హీరోలు, టెక్నీషియన్లు. వీళ్ల కోసం నిర్మాతలెందుకు సినిమాలు తీయాలి? నటీనటులు, సాంకేతిక నిపుణులు  కష్టకాలంలో నిర్మాతలకు అండగా నిలబడకపోతే వాళ్ల కోసం ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేయాల్సిన అవసరం నిర్మాతలకు ఎందుకు? ప్రస్తుతం నిర్మాతల నోట వినిపిస్తున్న మాట ఇది. ప్రొడక్షన్‌ విషయంలో పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప నిర్మాత బాగుపడన్న సంగతి.. ఇప్పటికి తెలిసింది. కళ్లు తెరచి రిపేర్‌ పేరులో ఇండస్ట్రీలో ప్రక్షాళన మొదలుపెట్టారు నిర్మాతలు . (TFI)


ఈ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్‌లు ఆపేశారు. వివిధ శాఖల ప్రతినిధులతో చర్చలు మొదలుపెట్టారు. డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, టికెట్‌ రేట్లు, ఓటీటీ, థియేటర్‌లో తినుబండారాలు తదితర విషయాలపై చర్చలు ఫలించాయి. వాటికి ఓ మార్గం దొరికింది. అయితే పారితోషికాలు, కాస్ట్‌ కటింగ్‌ విషయంలో జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎవరూ హీరోహీరోయిన్‌లను, ఇతర సాంకేతిక నిపుణలను పారితోషికాలు తగ్గించుకోమని నేరుగా చెప్పలేరు. బడ్జెట్‌ కంట్రోల్‌ కూడా నిర్మాతల చేయి దాటిపోయింది. ఎందుకంటే నిర్మాతలు చెట్టు కింద కూర్చుని ఖర్చులు రాసుకునే అకౌంటెంట్‌గా మారిపోయారు. చర్చల్లో మిగిలిన ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమెలా? 


ఆ దిశగానే మరింత విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌ తరహా కాల్షీట్లు అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక హీరోహీరోయిన్లే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రెమ్యునరేషన్‌ కూడా నిర్మాతలను బెంబేలెత్తిస్తున్నాయి. వారి డిమాండ్లు చూస్తుంటే నిర్మాతలకు చమట్లు పడుతున్నాయి.  హీరోహీరోయిన్ల సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సిబ్బందికి కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒక కారావ్యాన్‌ ఇద్దరు ఉపయోగించుకోవడానికి కూడా ఆర్టిస్ట్‌లు అంగీకరించడం లేదు. 

హీరోల ఇంటికి కార్లు పంపడం, వ్యానిటీ వ్యాన్‌ ఇవ్వడం, సిబ్బందిని చూసుకోవడం.. ఇదంతా పాత అలవాటే. ఇదంతా ఒకప్పుడు నిర్మాతలు అలవాటు చేసిందే! ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా ఇదే ఫార్ములా ఉపయోగిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే.. ‘హీరోలకు కోట్లు ఇస్తున్నారు.. మాకు లక్షల్లో ఇవ్వడానికి సమస్య ఏంటి’ అని డిమాండ్‌ ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఎదురు మాట్లాడుతున్నారట. హీరోల పారితోషికాలకు కత్తెర్లు వేయడం ఇప్పుడు ఎంత అవసరమో.. క్యారెక్టర్‌ ఆర్టిసుల దూకుడుకు కళ్లెం వేయడం అంతకంటే అవసరమని నిర్మాత భావిస్తున్నారు. 


అలాగే ఓ హీరోయిన్‌ సినిమాకు సంతకం చేసిందీ అంటే.. అక్కడి నుంచి సినిమా విడుదలై ప్రమోషన్‌ పూర్తయ్యే వరకూ ఆమె ఫ్లైట్‌ టికెట్లు, హాస్పిటాలిటీ మొత్తం నిర్మాత మీదే ఉంటుంది. ఇప్పుడు అదనంగా హీరోయిన్ల సిబ్బంది ఓ ఆరుమందికి  ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి వస్తుంది. ఇవన్నీ నిర్మాతలకు తడిసి మోపెడు అవుతుంది. హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఇలా అందరి లెక్కలు తేల్చే ప్రయత్నంలో నిర్మాతలు కసరత్తుల చేస్తున్నారు. వీటన్నింటినీ కంట్రోల్‌ చేయడానికి కొత్తగా ఓ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారని తెలిసింది. అదే ప్యాకేజీ సిస్టం. సినిమాకు సైన్‌ చేశాక... హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు ఓ ప్యాకేజీ సినిమా మొత్తానికి పారితోషికంగా ఫిక్స్‌ చేస్తారట. అందులోనే వారి సిబ్బందికి కూడా జీతాలు, ఇతరత్ర ఖర్చులు ఇవ్వాలనే ప్రతిపాదనను తీసుకొచ్చే అవకాశం ఉందని, ఈ పద్దతి తప్పకుండా వర్కవుట్‌ అవుతోందని భావిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీకి ఆర్టిస్ట్‌లు, హీరోయిన్లు అంగీకరిస్తారా అన్నది చూడాలి. అయితే హీరోల పారితోషికాల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల ‘మా’ సభ్యులతో కూడా ఆర్టిస్ట్‌ల పారితోషికం తగ్గించడం గురించి చర్చలు జరిగాయి. వారు సానుకూలంగా స్పందించారని తెలిసింది. హీరోల తరఫున రామ్‌చరణ్‌ బాధ్యత తీసుకుని రెమ్యునరేషన్‌ల విషయమై మాట్లాడతాను అన్నట్లు దిల్‌ రాజు చెప్పిన సంగతి తెలిసిందే! 


హీరోహీరోయిన్‌లకు ఇంత లగ్జరీ లైఫ్‌ను, సకల సదుపాయాలు అలవాటు చేసింది మీ నిర్మాతలేగా అని ఓ పెద్ద నిర్మాతను అడగగా ‘‘పరిస్థితులు బాగునప్పుడు ఇవన్నీ చిన్నగా అనిపించాయి. కానీ ఇప్పుడు ప్రతి విషయంలో రూపాయికి పది రూపాయిలు ఖర్చు అవుతుంది. అందుకే కాస్ట్‌ కటింగ్‌, పారితోషికాల్లో కొంత తగ్గింపు తప్పదు. అందుకే ప్యాకేజీ ఫార్ములాను అమలు చేయబోతున్నాం. ఇది తప్పకుండా వర్కవుట్‌ అవుతుంది. పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి’’ అని తెలిపారు. 

Updated Date - 2022-08-23T22:46:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!