ఓటీటీలోకి వచ్చేస్తున్న‘RRR’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటి నుంచంటే..?
ABN , First Publish Date - 2022-05-12T20:53:12+05:30 IST
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్ (Ajay Devgn) కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1127కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్ (Ajay Devgn) కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1127కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ విజువల్ వండర్‌ను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. సినీ ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూవీ స్ట్రీమీంగ్ డేట్‌ను ప్రకటించింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ‘జీ-5’ (Zee 5) లో స్ట్రీమింగ్ కానుంది. మే 20నుంచి తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోను అందుబాటులో ఉంటుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. హిందీ వెర్షన్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. కానీ, ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్ డేట్‌ను ఇంత వరకు వెల్లడించలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ డేట్ ప్రకటించడంతోనే సినీ ప్రేక్షకులు తమ సంతోషాన్ని నెట్టింట పంచుకుంటున్నారు. మే 20న తారక్ పుట్టిన రోజు కూడా కావడంతో తమకు మరింత స్పెషల్ అని ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more