Superstar Krishna Demise: సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు

ABN , First Publish Date - 2022-11-15T15:54:21+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది తెలుగు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Superstar Krishna Demise: సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది తెలుగు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

‘ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’

                                                                                                       - నందమూరి బాలకృష్ణ



‘కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు  పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. మేం ఎప్పుడు మీతోనే ఉంటాం మహేశ్ అన్న.. ఓం శాంతి. సూపర్ స్టార్ ఫరెవర్’.

                                                                                                       - జూనియర్ ఎన్‌టీఆర్


యావత్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయనో లెజెండ్. నాకు ఆయనతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన వ్యక్తిగతం ఎంటో నాకు పూర్తిగా తెలిసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా సూపర్‌స్టార్ కృష్ణగారు! ఈ దుఃఖ సమయంలో మహేష్, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి’

                                                                                                                    - రవితేజ


‘సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. చాలా బాధపడ్డాను. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని కలవడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’

                                                                                          - అనిల్ రావిపూడి


గుండె పగిలి పోయింది. మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు. లెజెండ్, ఐకాన్, ఎన్నో తరాలకు స్ఫూర్తి. మేమంతా మిమ్మల్ని మిస్ అవుతాం సర్. ఆయన కుటుంబం బలంగా ఉండాలని చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మంజుల, మహేశ్ బాబు సర్ మీకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు’ 

                                                                                             - నిఖిల్ సిద్ధార్థ



















Updated Date - 2022-11-15T15:54:21+05:30 IST