పుడమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా

ABN , First Publish Date - 2022-05-17T05:47:37+05:30 IST

‘హుషారు’ చిత్రంలో నటించిన తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం..

పుడమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా

‘హుషారు’ చిత్రంలో నటించిన తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘పుడమిని తడిపే తొలికరి మెరుపుల చినుకమ్మా.. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’ అంటూ భవ్యదీప్తి రాసిన  పాటను విడుదల చేశారు. సందీప్‌కుమార్‌ స్వరపరచిన ఈ పాటను తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ పాట బాగుంది. తేజ, అఖిల చాలా అందంగా కనిపించారు. చిత్రం హిట్‌ కావాలని కోరుకుంటున్నాను ’ అన్నారు. ‘పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కని ప్రేమకథలో వినోదాన్ని మిక్స్‌ చేసి ఈ కథ తయారు చేశాం. మ్యూజికల్‌గా సినిమా హిట్‌ అవుతుంది’ అన్నారు దర్శకుడు వెంకట్‌ వందేల. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ  చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ముల్లేటి నాగేశ్వరరావు.


Updated Date - 2022-05-17T05:47:37+05:30 IST

Read more