ఒక మాతృభాష కథ చెప్పాలని...

ABN , First Publish Date - 2022-11-15T05:58:55+05:30 IST

యశ్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. అరుణ్‌ భారతి దర్శకుడు...

ఒక మాతృభాష కథ చెప్పాలని...

యశ్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. అరుణ్‌ భారతి దర్శకుడు. వాకాడ అంజన్‌ కుమార్‌, యోగేశ్‌ కుమార్‌ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘మా సంస్థలో రూపొందిన 94వ చిత్రమిది. ఇప్పటి వరకూ ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేశాం. వాళ్లంతా స్టార్లుగా మారారు. యశ్‌ పూరి కూడా గొప్ప స్థాయికి చేరుకొంటాడు. ‘చెప్పాలని ఉంది’ ఓ వైవిధ్యభరితమైన చిత్రం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు ఆర్‌బి చౌదరి. ‘‘సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ద్వారా కథానాయకుడిగా పరిచయం కావడం గర్వంగా ఉంది. లవ్‌, ఎమోషన్‌, యాక్షన్‌, రొమాన్స్‌.. ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయ’’న్నారు యశ్‌ పూరి. డిసెంబరు 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు. 


Updated Date - 2022-11-15T05:58:55+05:30 IST

Read more