ఛార్లీ కోసం కశ్మీర్‌కు!

ABN , First Publish Date - 2022-05-17T05:49:17+05:30 IST

‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో పాన్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు రక్షిత్‌ శెట్టి తాజా చిత్రం ‘777 ఛార్లీ’...

ఛార్లీ కోసం కశ్మీర్‌కు!

‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో పాన్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు రక్షిత్‌ శెట్టి తాజా చిత్రం ‘777 ఛార్లీ’. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల అయింది. ఇందులో ధర్మగా రక్షిత్‌ నటించారు. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవలు, ఇడ్లీ, సిగరెట్‌, బీర్‌.. ఇవే తన ప్రపంచం అనుకునే ధర్మ జీవితంలోకి ఛార్లీ అనే కుక్క ప్రవేశిస్తుంది.  ముందు ఛార్లీ అంటే ఇష్టం చూపించక పోయినా ఒకసారి ప్రమాదంలో తనని కాపాడిన ఆ కుక్క అంటే ధర్మకు అభిమానం ఏర్పడుతుంది. అటువంటి కుక్క ఛార్లీని వెతుక్కుంటూ ధర్మ కశ్మీర్‌కు వెళ్లాల్సి వస్తుంది.  అక్కడ అతనికి  ఎదురైన పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలంటే ‘ 777 ఛార్లీ’ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు కిరణ్‌ రాజ్‌ కె. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో జూన్‌ 10న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు రక్షిత్‌ శెట్టి, జి.ఎస్‌.గుప్తా. 

Updated Date - 2022-05-17T05:49:17+05:30 IST

Read more