ఆ సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉండవు

ABN , First Publish Date - 2022-12-29T01:23:01+05:30 IST

సాయిరోనక్‌, అంకిత సాహా జంటగా నటించిన చిత్రం ‘రాజయోగం’. రామ్‌ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్‌రావు నిర్మించారు...

ఆ సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉండవు

సాయిరోనక్‌, అంకిత సాహా జంటగా నటించిన చిత్రం ‘రాజయోగం’. రామ్‌ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్‌రావు నిర్మించారు. ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరోనక్‌ సినిమా గురించి మాట్లాడుతూ...‘‘రాజయోగం’ ఒక రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌. రెండు గంటలపాటు నవ్వుకునేలా ఉంటుంది. ఇందులో నాది డ్రైవర్‌ పాత్ర. హీరో, హీరోయిన్ల ప్రేమ, పది వేల కోట్ల రూపాయల విలువైన వజ్రాల పాయింట్‌ చుట్టూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈవీవీ గారి శైలిలో ఒక చేజింగ్‌తో సినిమా సాగుతుంది. ఇలాంటి కథలకు లాజిక్‌ అవసరం లేదు. క్రియేటివ్‌గా ఎంత బాగుంది అనేది మాత్రమే చూడాలి. ‘రాజయోగం’ పూర్తి కమర్షియల్‌గా సాగుతుంది. పోరాట ఘట్టాలు, డాన్స్‌లు లాంటి వాణిజ్య హంగులతో పాటు రొమాన్స్‌ కూడా ఉంది. అయితే రొమాంటిక్‌ యాంగిల్‌లోనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తించారు. కానీ ఆ సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉండవు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు కంగారుపడ్డాను. ఎడిటింగ్‌లో చూశాక ఆ సన్నివేశాల్లో దర్శకుడి విజన్‌ అర్థమైంది. నాకు డాన్స్‌, ఫైట్స్‌లో మంచి పట్టు ఉంది. ఈ సినిమాలో ఆ నైపుణ్యాలను చూపించే అవకాశం దక్కింది. ‘కేజీఎఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి ఫాంటసీ చిత్రాలు నాకు ఇష్టం. ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్‌ అంటూ ఎవరూ లేరు. డాన్స్‌లు నేర్పించడం వల్ల కొందరు యాక్టర్స్‌ పరిచయం అయ్యారు. ఒకదానివెంట ఒకటిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాను. ప్రస్తుతం నీలకంఠ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ చిత్రం, అవికాగోర్‌తో ‘పాప్‌కార్న్‌’ అనే చిత్రం చేస్తున్నాన’న్నారు.

Updated Date - 2022-12-29T01:23:01+05:30 IST

Read more