ఇది జనం సినిమా..

ABN , First Publish Date - 2022-11-25T08:22:30+05:30 IST

‘‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ జనం సినిమా. మన సినిమా. మన చుట్టూ జరుగుతున్న విషయాలే... తెరపై చూపించాం....

ఇది జనం సినిమా..

‘‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ జనం సినిమా. మన సినిమా. మన చుట్టూ జరుగుతున్న విషయాలే... తెరపై చూపించాం. నిజాయతీతో చేసిన ప్రయత్నం ఇద’’న్నారు అల్లరి నరేశ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ.ఆర్‌.మోహన్‌ దర్శకుడు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ని కోరుతున్నారు. అందుకే మేం కూడా కొత్తగా ప్రయత్నించాం. నటుడిగా ‘నాంది’ నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. అంతటి సంతృప్తి ఈ సినిమా నాకిచ్చింద’’న్నారు. ‘‘ఇది సినిమా కాదు. కొంతమంది జీవితం. ఈ చిత్రానికి రాజేశ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. థియేటర్లో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇద’’న్నారు దర్శకుడు. ‘‘మార్పు ఎక్కడ మొదలైతే బాగుంటుందో చెప్పే కథ ఇద’’న్నారు మాటల రచయుత అబ్బూరి రవి. 

Updated Date - 2022-11-25T08:22:30+05:30 IST

Read more