నేను గర్వపడే చిత్రం ఇది
ABN , First Publish Date - 2022-11-04T05:33:41+05:30 IST
‘‘హిట్’ చిత్రం ప్రశ్నలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ‘హిట్ 2’ భయపెట్టి థ్రిల్ చేస్తుంది ఈ చిత్రంలో శైలేష్ కొలను నన్ను కొత్తగా చూపించారు’’...

‘‘హిట్’ చిత్రం ప్రశ్నలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ‘హిట్ 2’ భయపెట్టి థ్రిల్ చేస్తుంది ఈ చిత్రంలో శైలేష్ కొలను నన్ను కొత్తగా చూపించారు’’ అని అడివి శేష్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ని హీరో నాని విడుదల చేశారు. ‘ఇలా ట్రైలర్స్ విడుదల చేయడం కాదు, నీతో ఓ హిట్ సినిమాను నిర్మిస్తాను’ అన్నారు. అలా రూపొందిందే ‘హిట్ 2’ చిత్రం. మంచి చిత్రం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ‘హిట్ 2’ డిసెంబరు 2న విడుదలవుతోంది. థియేటర్స్‌లో కలుద్దాం’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ ‘శేష్ పర్ఫెక్ట్ జెంటిల్‌మేన్. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. తన పాత్రను అద్భుతంగా పోషించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాని గారికి ధన్యవాదాలు’ అన్నారు. ‘శేష్ అద్భుతమైన నటుడు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంద’ని మీనాక్షి చౌదరి అన్నారు.