రష్యాలోనూ తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2022-11-30T04:59:58+05:30 IST

తెలుగు నాట ‘పుష్ప’ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది దుమ్ము దులిపిన ‘పుష్ప’...

రష్యాలోనూ తగ్గేదేలే..!

తెలుగు నాట ‘పుష్ప’ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది దుమ్ము దులిపిన ‘పుష్ప’.. ఉత్తరాదిలోనూ తన హవా చూపించింది. సిసలైన పాన్‌ ఇండియా చిత్రంగా నిలిచింది. ‘తగ్గేదేలే...’ అంటూ అల్లు అర్జున్‌ మేనరిజాన్ని అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఫాలో అయ్యారు. ఆయా వీడియోలు అంతర్జాలంలో హల్‌ చల్‌ చేశాయి. ఇప్పుడు విదేశాల్లోనూ ‘పుష్ప’ ప్రభంజనం చూపించడానికి రెడీ అవుతోంది. డిసెంబరు 8న ఈ చిత్రాన్ని రష్యాలో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంగళవారం ఓ కొత్త ట్రైలర్‌ విడుదల చేశారు. అల్లు అర్జున్‌, సుకుమార్‌ రష్యా వెళ్లి.. అక్కడ తమ సినిమాని ప్రమోట్‌ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు చిత్రాలు చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. రష్యాలోనూ ‘పుష్ప’ రఫ్ఫాడించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అక్కడి నుంచి ఎన్ని వసూళ్లు వస్తాయో చూడాలి. 


Updated Date - 2022-11-30T04:59:58+05:30 IST

Read more