ఇంటర్వెల్‌ ఉండదు

ABN , First Publish Date - 2022-12-18T01:14:39+05:30 IST

నయనతార ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. ఈ నెల 22న యూవీ క్రియేషన్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది...

ఇంటర్వెల్‌ ఉండదు

నయనతార ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. ఈ నెల 22న యూవీ క్రియేషన్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ మీడియాతో ముచ్చటించారు.

  • లాక్‌డౌన్‌ సమయంలో ప్రేతాత్మ ఆవహించిన బిడ్డను ఓ తల్లి ఎలా కాపాడుకుంది అనేది కథ. రోమాలు నిక్కబొడిచే హారర్‌ థ్రిల్లర్‌ ఇది. నయనతారతో గతంలో ‘మయూరి’ చిత్రాన్ని రూపొందించాను. దర్శకుడిగా నాపైన ఆమెకు నమ్మకం ఉంది. దీన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలనేది ఆమె కోరిక. అందుకే విఘ్నేష్‌తో కలసి నిర్మించారు. ఫాదర్‌ అగస్టీన్‌ పాత్రలో అనుపమ్‌ఖేర్‌ నటన ఆకట్టుకుంటుంది.

  • సినిమా నిడివి గంటన్నర మాత్రమే. ఇంటర్వెల్‌ ఉండదు. ఉత్కంఠతతో ఏకబిగిన కథ సాగుతుంది. పృథ్వీ సంగీతం అందించారు. సౌండ్‌ డిజైనింగ్‌ కోసమే మూడు నెలలు సమయం తీసుకున్నాం. తెలుగులో నాని చిత్రాలంటే ఇష్టం. ఆయనతో ఒక సినిమా తీయాలని ఉంది.

Updated Date - 2022-12-18T01:15:03+05:30 IST

Read more