సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

టైటిల్‌లో అంతకు ముందు Ramarao లేడా?

ABN, First Publish Date - 2022-07-08T21:38:55+05:30

మాస్ మహారాజా రవితేజ (Raviteja) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ జోరుమీదున్నాడు. వాటిలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) చిత్రం ఒకటి. కొత్త దర్శకుడు శరత్ మండవ (Sharath Mandava) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ యమ్మార్వోగానూ, డిప్యూటీ కలెక్టర్ గానూ నటిస్తూ.. అభిమానుల్ని సరికొత్తగా ఎంటర్ టైన్ చేయబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజా రవితేజ (Raviteja) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ జోరుమీదున్నాడు. వాటిలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) చిత్రం ఒకటి. కొత్త దర్శకుడు శరత్ మండవ (Sharath Mandava) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ యమ్మార్వోగానూ, డిప్యూటీ కలెక్టర్ గానూ నటిస్తూ.. అభిమానుల్ని సరికొత్తగా ఎంటర్ టైన్ చేయబోతున్నారు. దివ్యాంషు కౌశిక్ (Divyanshu koushik), మల్లూ బ్యూటీ రజిషా విజయన్ (Rajisha Vijayan) కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో తొట్టెంపూడి వేణు (Thottempudi Venu) చాన్నాళ్ళకు ఇందులో సిఐ జమ్ము మురళీ పాత్రలో కనిపించబోతున్నారు. ఆర్టీ టీమ్ వర్క్స్, యసెల్వీ సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. 


ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా లిరికల్ వీడియోస్‌ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు. తాజాగా అన్వేషి జైన్ (Anveshi Jain) పై చిత్రీకరించిన ‘నా పేరు సీసా’ (Naa Peru Seesa) సింగిల్ కు మంచి పేరొచ్చింది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ అభినయం ఆకట్టుకుంది. ఇదివరకెన్నడూ చేయని స్థాయిలో ఈ సినిమాలో రవితేజ అభినయం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వృత్తిపట్ల అంకింత భావంతో పనిచేసే సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్‌ రామారావుకు ఒక కేసు విషయంలో‌పై అధికారులనుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆ క్రమంలో అతడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? న్యాయం పక్షాన ఎలా నిలబడ్డాడు అన్నదే మిగతా కథాంశం. 


ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ వెనుకున్న ఒక సీక్రెట్‌ను బైట పెట్టారు. ముందుగా ఈ సినిమాకి ‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ అనుకోలేదట. ‘గవర్నమెంట్ ఆన్ డ్యూటీ’ (Government Onduty) టైటిల్ ఖాయం చేయాలనుకున్నారట. అయితే ఆ టైటిల్ కెమేరామేన్ సత్యన్ సూర్యన్ (Satyan Suryan) కు నచ్చలేదట.  దాంతో అతడు మరో టైటిల్ ను సూచించాడట. అదే ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ విషయం రవితేజకు చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. దాంతో ఆ టైటిల్ ఫైనల్ గా పోస్టర్ మీదకు వచ్చింది. నిజానికి ఈ టైటిల్ కే అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 

Updated Date - 2022-07-08T21:38:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!