చాలా సర్ర్పైజ్లు ఉన్నాయి
ABN , First Publish Date - 2022-08-18T12:42:02+05:30 IST
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ వ్యవస్థాపకులు ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ తొలిసారి నిర్మించిన చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’...
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ వ్యవస్థాపకులు ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ తొలిసారి నిర్మించిన చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’. ఏడిద శ్రీరాం సమర్పిస్తున్నారు. దర్శకుడు అనుదీప్ కె.వి కథను అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు జంటగా నటించారు. సెప్టెంబరు2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వంశీధర్, లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇందులో హీరో పవన్ కల్యాణ్ ఫ్యాన్. తన ప్రేయసి ‘ఖుషీ’ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో టికెట్లు కావాలని అడుగడంతో వాటికోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడనేది కథ. చాలా సర్ర్పైజ్లు ఉంటాయి. భిన్నమైన కథే అయినా వినోదం పంచడంలో ‘జాతిరత్నాలు’ను తలపిస్తుంది. శ్రీజ అనుభవం ఉన్న నిర్మాతలా పనిచేశారు’’ అన్నారు.