సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అప్పుడు ‘శివ’... ఇప్పుడు ‘ది ఘోస్ట్‌’

ABN, First Publish Date - 2022-10-05T07:13:59+05:30

‘శివ’ సినిమా విడుదలైన తరవాత అందులోని సాంకేతిక నైపుణ్యం గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకొన్నారో, ‘ది ఘోస్ట్‌’ చూశాక కూడా అలానే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘శివ’ సినిమా విడుదలైన తరవాత అందులోని సాంకేతిక నైపుణ్యం గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకొన్నారో, ‘ది ఘోస్ట్‌’ చూశాక కూడా అలానే మాట్లాడు కొంటారన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ది ఘోస్ట్‌’ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నాగార్జున విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ‘గరుడవేగ’  చూశాను. బాగా నచ్చింది. అందుకే తనని పిలిచి ‘ఓ యాక్షన్‌ కథ తయారు చేయ్‌’ అని అడిగాను. నన్ను దృష్టిలో ఉంచుకొనే ‘ది ఘోస్ట్‌’ కథ రాశాడు. టైటిల్‌ విషయంలో కాస్త భయం ఉండేది. ‘హారర్‌ సినిమా అనుకొంటారేమో’ అని అడిగాను. ‘ఫస్ట్‌లుక్‌ వచ్చాక ఆ అభిప్రాయాలు మారిపోతాయి’ అని ప్రవీణ్‌ చెప్పాడు. తాను చెప్పినట్టే జరిగింది. ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. యాక్షన్‌ కథలో కుటుంబ బంధాల్ని మేళవించడం అరుదుగా జరిగే విషయం. ఈ సినిమాతో ఆ కాంబినేషన్‌ కుదిరింద’’న్నారు. 


Updated Date - 2022-10-05T07:13:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!