సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి

ABN, First Publish Date - 2022-09-29T05:38:15+05:30

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం ఇటీవలె విడుదలై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రం ఇటీవలె విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. నాగశౌర్య మాట్లాడుతూ ‘గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఛలో’ తర్వాత నిర్మాతగా మరోసారి గర్వపడే హిట్‌ ఇచ్చిన మా అమ్మకు థాంక్స్‌’ అన్నారు. నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ ‘అన్ని ఒత్తిళ్లను పోగొట్టి మనుసుని హాయితో నింపే సినిమా ఇద’న్నారు. ఈ సినిమాకు పెద్ద విజయం చేకూర్చిన ప్రేక్షకులకు అనీష్‌ ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2022-09-29T05:38:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!