The warrior: దడ దడమని హృదయం శబ్దం!

ABN , First Publish Date - 2022-06-04T21:17:56+05:30 IST

రామ్‌ (Ram) – కృతి శెట్టి (Krithishetty)జంటగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’ (THe warrior). తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. జులై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘కమ్‌ ఆన్‌ బేబీ లేట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు’.. అంటూ సాగే పాటతో అలరించారు రామ్‌ – కృతి శెటి.

The warrior: దడ దడమని హృదయం శబ్దం!

రామ్‌ (Ram) – కృతి శెట్టి (Krithishetty)జంటగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’ (THe warrior). లింగుస్వామి దర్శకత్వంలో  శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. జులై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘కమ్‌ ఆన్‌ బేబీ లేట్స్‌ గో ఆన్‌ ది బుల్లెటు’.. అంటూ సాగే పాటతో అలరించారు రామ్‌ – కృతిశెట్టి. ఇప్పుడు మరో ప్రేమ పాటతో ఉర్రూతలూగించడానికి సిద్ధమైందీ జంట. శనివారం ఈ సినిమాలో ‘దడ దడమని హృదయం శబ్దం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం’ అంటూ సాగే పాటను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను హరిచరణ్‌ ఆలపించారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. 


Updated Date - 2022-06-04T21:17:56+05:30 IST