సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Warrior: థియేట్రికల్ ట్రైలర్ వచ్చేస్తోంది..

ABN, First Publish Date - 2022-06-29T19:55:49+05:30

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వారియర్‌’ (The Warriorr).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది వారియర్‌’ (The Warriorr). ఇందులో రామ్ సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు (జులై 1న) ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.   


వచ్చే గురువారం సాయంత్రం 7:57 గంటలకు ది వారియర్ మూవీ ఠియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో రామ్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు. మొదటిసారి పోలీస్‌గా ఎనర్జిటిక్ స్టార్ నటిస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 


ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి ఓక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో నటించి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్మ్ మరోసారి అదే తరహా చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమాలోని 'బుల్లెట్' సాంగ్‌ను  విడుదల చేయగా.. దీనికి ఆడియన్స్ నుంచి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదల చేసిన మరోసాంగ్ 'విజిల్' కూడా అదేస్థాయిలో దూసుకుపోతోంది. ఇక తాజాగా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



Updated Date - 2022-06-29T19:55:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!