సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The warrior: మరోసారి సిక్స్ ప్యాక్ చూపించబోతున్న ఎనర్జిటిక్ హీరో..?

ABN, First Publish Date - 2022-01-20T16:28:07+05:30

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడట. తమిళ దర్శకుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడట. తమిళ దర్శకుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు హీరో రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి వచ్చి హల్‌చల్ చేస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్‌‌’లో సిక్స్ ప్యాక్ చూపించిన ఈ ఎనర్జిటిక్ హీరో మరోసారి  ‘ది వారియ‌ర్‌’ మూవీలోనూ అదే తరహాలో కనిపించబోతున్నాడట. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇక ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా రామ్ కనిపించబోతున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.  

Updated Date - 2022-01-20T16:28:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!