The Warrior: టీజర్ వచ్చేదెప్పుడంటే..

ABN , First Publish Date - 2022-05-12T16:59:20+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది వారియర్' (The Warrior). ఈ మూవీ నుంచి టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయబోతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

The Warrior: టీజర్ వచ్చేదెప్పుడంటే..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది వారియర్' (The Warrior). ఈ మూవీ నుంచి టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయబోతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రామ్ పోతినేనికి మాస్ హీరోగా సాలీడ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. చెప్పాలంటే ఈ మూవీతో హిట్ కొట్టి ఒకేసారి పూరి జగన్నాథ్, హీరో రామ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా తరువాత రామ్ నటించిన 'రెడ్' (Red) చిత్రం ఆశించిన సక్సెస్‌ను అందుకోలేకపోయింది.


అయినా కూడా మాస్ కథనే మళ్ళీ ఎంచుకున్నాడు రామ్. తమిళంలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి పాపులారిటీ ఉన్న ఎన్. లింగుసామి (N LinguSwamy) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతిశెట్టి (Krthi Setty), అక్షర గౌడ (Akshara Gowda) హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను రాబట్టింది. 


కాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మే 14న సాయంత్రం 5:31 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 'ది వారియర్' సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. మరి త్వరలో రాబోతున్న టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ భాషలోనూ రిలీజ్ చేయనున్నారు. 

Updated Date - 2022-05-12T16:59:20+05:30 IST